telugu navyamedia
రాజకీయ

సేఫ్ జోన్ లో .. కర్ణాటకీయం.. ఆ ఒక్కడితో సరి.. 

CM Kumaraswamy killing order
పూర్తిగా వేడెక్కిన కర్ణాటక రాజకీయ ఒక్కసారిగా చల్లబడింది. సంకీర్ణ ప్రభుత్వం సేఫ్‌జోన్‌లోకి వెళ్లింది. రాష్ట్ర కేబినెట్‌ విస్తరణ తర్వాత మంత్రి పదవులు కోల్పోయిన, పదవులు దక్కనివారు కాంగ్రెస్‌ నేతల తీరుపై ఎదురుదాడికి దిగారు. ఇలా ముగ్గురు నలుగురు నుంచి ఆరంభమైన వ్యతిరేకత ఏకంగా 10 మందికి పైగా చేరడంతో సంకీర్ణ ప్రభుత్వానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు సీఎం కుమారస్వామి ఈ ఒత్తిడిని తానుభరించలేకపోతున్నానని తాను క్లర్కుగా మారానని ఏ క్షణంలోనైనా రాజీనామా చేస్తానని చేసిన వ్యాఖ్యలు సర్కార్‌ కూలుతుందనేందుకు నిదర్శనంగా మారాయి. కాంగ్రెస్‌, జేడీఎస్‌ అగ్రనేతలు సైతం ఇక ప్రభుత్వాన్ని వదిలేసుకోవాల్సి వస్తుందేమోనని బెంగపడ్డాయి. 
ఈ నెల 8న బడ్జెట్‌ సమావేశాలు ఉండగా 6వ తేదీ ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం సాగింది. రెండు రోజుల్లో ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్‌పైన నీలి నీడలు వ్యాపించాయి. అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప జేడీఎస్‌ ఎమ్మెల్యే కుమారుడితో జరిపిన డీల్‌ ఆడియో విడుదల కావడంతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది. వారం రోజుల పాటు ఇదే హాట్‌ టాపిక్‌గా శాసనసభను కుదిపేసింది. డీల్‌ వ్యాఖ్యల కంటే స్పీకర్‌ రమేష్‌ కుమార్‌తో కూడా అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నామనే వాయిస్‌ అదరగొట్టింది. ఓ వైపు అధికార పార్టీ విచారణకు డిమాండ్‌ చేయగా బీజేపీ నేతలు ససేమిరా? అంటూనే చివరకు తప్పు చేశాం వదిలేయండి అనే స్థితికి చేరారు. ఇంతలోనే విప్‌లను సైతం ఉల్లంఘిస్తూ వస్తున్న నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బుధవారం అనూహ్యంగా శాసనసభలో దర్శనమిచ్చారు.
దీనితో సంకీర్ణ నేతల్లో సర్కారుకు డోకా లేదనే భరోసా ఏర్పడింది. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని తెలిపిన స్వతంత్ర ఎమ్మెల్యే నాగేష్‌ సైతం తిరిగి సొంత గూటికి చేరారు. సమన్వయ కమిటీ చైర్మన్‌ సిద్దరామయ్య, మంత్రి డి.కె.శికుమార్‌ల సమక్షంలో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు లేఖ అందించారు. ప్రస్తుతం కాంగ్రె్‌సలో అసంతృప్తి మాయం కాగా స్వతంత్రుల్లో ఒకరు వెనుదిరగడంతో సంకీర్ణ ప్రభుత్వానికి తిరుగులేని పరిస్థితి ఏర్పడింది. ఈ దెబ్బతో లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా మరో నాలుగైదు నెలలు సంకీర్ణ ప్రభుత్వం సేఫ్‌ జోన్‌లో ఉన్నట్టేనని చెప్పవచ్చు.

Related posts