telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నేటితో ముగియనున్న .. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం …! ఎన్నికలా..బీజేపీకి పగ్గాలా.. !

karnataka govt ball into governor hands

కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌) సంకీర్ణ ప్రభుత్వ పరిపాలన ముగియనుంది. అనంతరం ఎన్నికలా లేక బీజేపీ మ్యాజిక్ ఫిగర్ చూపించి అధికారం హస్తగతం చేసుకోనుందో వేచి చూడాల్సి ఉంది. రెండువారాలుగా ఆ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలకు సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడే అవకాశాల్తున్నాయి. తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన 15 మంది రెబల్‌ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రావాలని ఒత్తిడి చేయరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ఈ తీర్పు అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్న కుమారస్వామి ప్రభుత్వానికి సంకట స్థితిని తెచ్చింది. రాజీనామా చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకపోతే ప్రభు త్వం మైనార్టీలో పడిపోయి విశ్వాస పరీక్షలో ఓడిపోయే ప్రమాదం నెలకొన్నది. దీంతో కొన్ని సాంకేతిక కారణాలను చూపించి బలపరీక్షను వాయిదా వేయించేందుకు అధికార పార్టీల నేతలు స్పీకర్‌తో భేటీ అయ్యారు. స్పీకర్‌ తీసుకునే నిర్ణయంపైనే కుమారస్వామి సర్కార్‌ భవితవ్యం ఆధారపడి ఉంది.

ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదంపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌దేనని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తీర్పును స్వాగతించిన స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ రాజ్యాంగ సూత్రాలను అనుసరించి వ్యవహరిస్తానని పేర్కొన్నారు. కోర్టు నిర్ణయం ప్రజాతీర్పును వమ్ము చేసిన ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించేదిగా ఉన్నదని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించగా, ఇది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి లభించిన విజయమని బీజేపీ ప్రశంసించింది.

Related posts