telugu navyamedia
రాజకీయ వార్తలు

సభలో బలం నిరూపించుకోవాలి..కుమారస్వామికి గవర్నర్ మళ్లీ లేఖ

CM Kumaraswamy killing order

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం గంట గంటకు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల్లోపు బలపరీక్ష పూర్తి చేయాలని తొలుత గవర్నర్ సూచించిన విషయం తెలిసిందే. ఐతే పూర్తి చర్చ జరిగిన తర్వాతే ఓటింగ్ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీంతో విశ్వాసపరీక్ష మరింత ఆలస్యం కానున్న నేపథ్యంలో సీఎం హెచ్‌డీ కుమారస్వామికి గవర్నర్ మళ్లీ లేఖ రాశారు. సభలో బలం నిరూపించుకోవాలని కుమారస్వామికి గవర్నర్ సూచించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోపు బలం నిరూపించుకోవాలని కోరారు.

ఇదిలా ఉండగా విప్‌పై క్లారిటీ ఇవ్వాలని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండురావు సుప్రీం కోర్టుకు లో పిటిషన్ వేశారు. 17వ తేదీనాటి సుప్రీం కోర్టు ఉత్తర్వుల్లో విప్‌పై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేల హాజరుపై బలవంతం చేయలేమన్న కోర్టు ఆదేశాలపై గుండురావు స్పష్టత కోరారు.

Related posts