telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేజీఎఫ్2 సినిమాకు నోటీసులు

క‌ర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్‌”. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా నటించారు. ఈ చిత్రం క‌న్న‌డ‌లోనే కాక తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో మంచి విజ‌యం సాధించింది. దాదాపు 200 కోట్ల‌కి పైగా కలెక్ష‌న్స్ సాధించి అన్ని ఇండ‌స్ట్రీల‌ని షాక్‌కి గురి చేసింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా చాప్ట‌ర్ 2ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. చిత్రంలో ముఖ్య పాత్ర‌ల‌లో ర‌మ్య‌కృష్ణ‌, సంజ‌య్ ద‌త్‌, ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌వీనా టాండన్.. ఇందిరా గాంధీ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ ఇటీవల హీరో యష్ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైంది. ఈ టీజర్ విడుదలైన 24గంటల్లోనే దాదాపు ఐదు మిలియన్ల వ్యూస్ తెచ్చుకొని రికార్డులు తిరగరాసింది. అయితే ఈ సినిమాకు ఊహించని అడ్డంకి ఎదురైంది. ఈ సినిమా నుంచి కొన్ని సన్నవేశాలు తొలగించాల్సిందిగా కర్ణాటక ఆరోగ్య శాఖ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో హీరో యష్ పోగ త్రాగే సన్నివేశాలను తొలగించాలని తెలిపింది. అంతేకాకుండా దీనికి సంబంధించి హీరో యష్‌కు చిత్ర యూనిట్‌కి నోటీసులను జారీ చేసింది. టొబాకో 2003చట్టంలోని సెక్షన్5 నిబంధనల ప్రకారం పోగ త్రాగే సన్నవేశాలు ఉండకూదని, వాటిని తొలగించకపోతే ఈ చట్టాన్ని అతిక్రమించనట్లేనని తెలిపింది. ఇటువంటి సన్నవేశాలన కారణంగా యువత చెడు దారిపట్టే అవకాశాలు ఉన్నాయని, అందుకనే ఈ సినిమా నుంచి అన్ని పొగ త్రాగే సీన్‌లను తొలగించాలని తెలపింది. పొగ త్రాగడం కారణంగా క్యాన్సర్, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు వస్తాయని, సినిమాల్లో హీరోలు పొగ తాగడం చూసి యువత కూడా వారి అడుగుల్లో నడిచి పొగ త్రాగుతారని దాంతో దేశంలోని యువత అనారోగ్యం పాలవుతుందని చెప్పారు. అందుచేత కేజీఎఫ్2 సినిమా నుంచి పొగ త్రాగే సన్నివేశాలను తొలగించాలని తెలిపింది. వాటిని తొలగించకపోతే సినిమాపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Related posts