telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆసుపత్రి నుంచి సిద్ధరామయ్య డిశ్చార్జ్

Siddaramaiah comments sadvi

కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సిద్ధరామయ్య అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. యాంజియోప్లాస్టీ చికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డిసెంబరు 11 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు.’నేను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాను. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. 10-15 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాకు సూచించారు’ అని సిద్ధరామయ్య మీడియాకు తెలిపారు.

Related posts