telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అక్కడ మళ్ళీ తెరుచుకున్న కాలేజీలు…

students college

కర్ణాటకలో కళాశాలు పునప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి నేపధ్యంలో ప్రభుత్వం పాఠశాలలు,కళాశాలను ముసివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆన్ లాక్ లో భాగంగా ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కళాశాలను తేరిచేం దుకు కర్ణాటక ప్రభుత్వం సిద్దమైంది.చివరి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను మాత్రమే అనుమతిస్తున్నారు.విశ్వవిద్యాలయ గ్రాంట్ కమిషన్ యుజిసి, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కరోనా వైరస్ నియంత్రణకు ముందు చర్యలను తీసుకున్నారు.ఈ క్రమంలో ఫైనల్ ఇయర్ విద్యార్థుల కు సాధ్యమైనంత త్వరలో ప్రాక్టికల్స్ పూర్తి చేసేలా కళాశాల యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఇక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో క్యాంటీన్లు కూడా మూసివేశారు.విద్యార్థులు తప్పనిసరిగా శానిటైజర్లు,మస్కులను వినియోగించేల చర్యలు చేపట్టారు.అదేవిధంగా అధ్యాపకులకు 10 నుండి 15 రోజులకు ఒకసారి పరీక్షించడంపై కళాశాల యాజమాన్యం దృష్టి సారించింది.చివరి సంవత్సరం విద్యార్థులు మాత్రమే కళాశాల అనుమతి ఇస్తున్న కళాశాలలు సామాజిక దూరాన్ని పాటిస్తూ తల్లిదండ్రుల నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు.అదేవిధంగా అవసరం ఉంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది పరీక్ష చేయించుకోవాలని యాజమాన్యం సూచిస్తోంది. అదేవిధంగా సుమారు 450 వైద్య కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు.మొత్తం మీద కళాశాల ప్రారంభం కావడంతో కళాశాలు కోవిడ్ నియంత్రణకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాయి.

Related posts