telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కర్ణాటకా బంద్ కు పిలుపు…

yedyurappa cm karnataka

ప్రో-కన్నడ ఆర్గనైజేషన్ కర్ణాటకా రాష్ట్రం మొత్తం బంద్ చేయాలంటూ పిలుపునిచ్చింది. ఈ బంద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తోంది. ప్రో కన్నడ వారు ఈ నిర్ణయం తీసుకోవాడానికి కర్ణాటకా ప్రభుత్వం నిర్ణయమే కారణంగా చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మరాఠా డవలప్‌మెంట్ అథారిటీ (ఎండీఏ)ను తీసుకొచ్చేందుకు ఆలోచిస్తోంది. ఈ నిర్ణయాన్ని రాష్ట్రసీఎం యెడ్యురప్ప నవంబరు 14న తెలిపారు. అయితే ముందుగా కన్నడిగాన్‌కు కావలసిన సంక్షేమాలను చూడాలని, ఇతర భాషల గురించి తరువాత ఆలోచించాలని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోదని, అంతేకాకుండా రాష్ట్రంలో ఎటువంటి బంద్ జరగకుండా నిలువరిస్తుందని అన్నారు. అయితే ఇప్పటికే ఎండీఏ కార్పొరేషన్‌కు ఇచ్చేందుకు దాదాపు రూ.50కోట్లను కేటాయించిందని తెలిపారు. అయితే ఇటీవల రాష్ట్ర సీఎం కన్నడా వారితో మాట్లాడారు. రాష్ట్రంలో ఎటువంటి బంద్ చేయవద్దని తెలిపారు. అంతేకాకుండా కన్నాడాకు ప్రాముఖ్యతను ఇచ్చామని, అంతేకాకుండా వారికి కావలసిని అవసరాలు తీర్చేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కన్నడకు ప్రాముఖ్యతను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ బంద్‌లో హోటళ్లు, బస్సు సేవలు, ప్రభుత్వ ఆఫీసులు పాల్గొనవని కేవలం ఆటో, టాక్టీ వారు మాత్రమే పాల్తొననున్నారని అన్నారు. షాపులు, హోటల్లు తెరుచుకునేందుకు అనుమతి ఉంది, లాక్ డౌన్ కారణంగా వారు ఎంతగానో నష్టపోయారు. ఈ బంద్‌ కారణంగా ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం దాదాపు 14 వేల మంది పోలీసులను నియమించనుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వీరశైవ లింగయాత్ డవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను కూడా దాదాపు రూ.500 కోటలతో ప్రారంభించేందుకు ప్రయతనిస్తోంది.

Related posts