telugu navyamedia
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ తీరు పై అసెంబ్లీలో నిప్పులు చెరిగిన కుమారస్వామి

CM Kumaraswamy killing order

కర్ణాటక రాజకీయ సంక్షోభానికి నేడు తెరపడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నేడు విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన కర్ణాటక సీఎం కుమారస్వామి అసెంబ్లీలో చేసిన ప్రసంగం పెను దుమారాన్ని రేపింది. 15 మంది కాంగ్రెస్, రెబల్ ఎమ్మెల్యేలు ముంబైలోనే ఉండటంతో, విశ్వాస పరీక్షకు ముందే కుమారస్వామి సర్కారు మైనారిటీలో పడిపోగా, ఈ ఉదయం సభ్యులను ఉద్దేశించి కుమారస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ సభ్యులను ఆ పార్టీ నేతలు కాపాడుకోలేకపోయారని విమర్శించారు. తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ముళ్లపైనే కూర్చున్నానని, ఆ ముళ్లన్నీ కాంగ్రెస్ వేనని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ భావించడం లేదని నిప్పులు చెరిగారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, కుమారస్వామి వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీంతో జేడీ(ఎస్), కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గందరగోళంపై స్పీకర్ మాట్లాడుతూ, రెబల్ ఎమ్మెల్యేల తీరు ఏ మాత్రం సరికాదని అన్నారు. సభలోని రెండు వర్గాలకూ నైతిక విలువలు లేవని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts