telugu navyamedia
news political Telangana

కరీంనగర్‌ మేయర్‌ గా సునీల్‌రావు!

muncipal elections telangana

కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ గా సునీల్‌ రావు పేరును టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఖరారు చేసింది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లోని మొత్తం 60 డివిజన్లకుగాను 33 డివిజన్లను గెల్చుకుని టీఆర్‌ఎస్‌ ఇక్కడ అధిక్యం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు నిన్న టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

స్వతంత్ర అభ్యర్థుల చేరికతో టీఆర్‌ఎస్‌ బలం 40కి చేరింది. భారతీయ జనతా పార్టీ 13 డివిజన్లలో గెలవగా, ఎంఐఎం 6 డివిజన్లు, ఇతరులు 8 డివిజన్లలో గెలిచారు. మూడింట రెండొంతుల మెజార్టీకి చేరుకున్న టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మేయర్‌ పీఠానికి సునీల్‌రావును ఎంపిక చేయడంతో ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Related posts

ఛత్తీస్ గఢ్ సీఎంకు మాతృవియోగం

vimala p

ప్రభుత్వ విధానాలకు కోర్టు తీర్పు శరాఘాతం లాంటిది: సోమిరెడ్డి

vimala p

కాంగ్రెస్ ఖాళీ.. బీజేపీకి స్థానం లేదు: ఒవైసీ

vimala p