telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొడుకును క్రికెటర్ చేస్తానంటున్న కరీనా

Taimur

బాలీవుడ్ సెలబ్రిటీ జంట కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ కు బాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందంటే… తైమూర్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొన్ని గంటల్లోనే లక్షల లైకులు, షేర్లతో వైరల్ గా మారిపోతాయి. అంతేకాదు బయట ఎక్కడైనా కన్పిస్తే చాలు మీడియా కెమెరాలు క్లిక్ మనాల్సిందే. తైమూర్ తనకున్న ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. పుట్టుకతోనే స్టార్ అయిపోయాడు. క్యూట్ బేబీగా తైమూర్ అలీఖాన్ దేశవ్యాప్తంగా చాలా గుర్తింపును పొందాడు. ఈ బాలుడికి పెట్టిన తైమూర్ అనే పేరు కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. భారత్‌పై దండెత్తిన ఒక ముస్లింరాజు పేరు కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సైఫ్, కరీనా జంట ఆ పేరు విషయంలో వెనక్కి తగ్గలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనా తన కుమారుడి భవిష్యత్తు గురించి మాట్లాడింది. తన కుమారుడిని పెద్ద క్రికెటర్‌ని చేయాలనుకుంటున్నట్టు వెల్లడించింది. తైమూర్ తాత అయిన టైగర్ పటౌడీ గతంలో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అందుకే తాత బాటలో తైమూర్‌ను కూడా క్రికెటర్‌ను చేయాలనుకుంటున్నట్టు కరీనా చెప్పింది. అయితే స్టార్ కిడ్ తైమూర్ అలీఖాన్ పెద్దయ్యాక ఏమవుతానంటాడో చూడాలి.

Related posts