telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ పై కరీనా వ్యాఖ్యలు… దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Kareena

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్ తీవ్ర దుమారం రేపింది. బాలీవుడ్‌లోని బంధుప్రీతి కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గతంలో వెకిలి వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ కరీనా కపూర్ తీవ్రంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. కరీనా నీకు చాలా పొగరెక్కువ. నీకు ఎలాంటి ప్రతిభా లేదు. కేవలం కపూర్ అనే ఇంటి పేరు వల్ల నువ్వు హీరోయిన్‌గా ఎదిగావు`, `నిన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంది`, `బాయ్‌కాట్ కరీనా కపూర్` అంటూ నెటిజన్లు ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. గతంలో సారా అలీఖాన్‌తో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైన కరీనా.. సుశాంత్ గురించి వెకిలిగా మాట్లాడింది. `సారాకు నువ్వు ఇచ్చే డేటింగ్ టిప్ ఏంటి?` అని వ్యాఖ్యాత కరీనాను ప్రశ్నించారు. దీనికి స్పందించిన కరీనా.. `చెత్త మొహంతో ఉండే నీ మొదటి సినిమా హీరోతో మాత్రం డేట్‌కు వెళ్లక`ని సారాతో చెప్పింది. సారా మొదటి సినిమా `కేదార్‌నాథ్`లో సుశాంత్ హీరోగా నటించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts