telugu navyamedia
సినిమా వార్తలు

“అరుంధతి” హిందీ రీమేక్ లో కరీనా ?

Kareena

అనుష్క హీరోయిన్ గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అరుంధతి”. ఈ చిత్రం తెలుగులో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. జేజమ్మగా అనుష్క చేసిన అద్భుతాభినయం ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఈ చిత్రంతో అనుష్క కెరీర్ మలుపు తిరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కుల్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిందీ రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో నాయికగా అనుష్కశర్మ, కరీనాకపూర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తొలుత అనుష్కశర్మను కథానాయికగా అనుకున్నారు. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్కే టాయించలేకపోయింది. ప్రస్తుతం చిత్ర నిర్మాతలు కరీనాకపూర్‌ను సంప్రదించగా…ఆమె సినిమాలో నటించడానికి సుముఖతను వ్యక్తం చేసిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది.

Related posts