telugu navyamedia
సినిమా వార్తలు

“ఆంటీ” అన్నఅభిమాని… స్టార్ హీరోయిన్ ఫైర్

Kareena-Kapoor

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ను వివాహం చేసుకుని ఒక కుమారుడికి జన్మనిచేసింది కరీనా కపూర్. ఆమె కుమారుడు తైమూర్ అలీఖాన్ ను అప్పుడే బిటౌన్ లో భారీగా అభిమానులు ఉన్నారు. ఇక కరీనా పెళ్లి తరువాత కూడా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం కరీనా కపూర్, అక్షయ్ కుమార్ జంటగా “గుడ్ న్యూస్” అనే సినిమా రూపొందుతోంది. కరీనా తన కుటుంబంతో కలిసి ఎంత కూల్ గా కన్పిస్తారో… ఎవరైనా తనపైగానీ తన కుటుంబంపై గానీ కామెంట్స్ చేస్తే అంతే ఫైర్ అవుతారు.

ఇటీవల ఓ అభిమాని తనను “ఆంటీ” అని సంభోధించడంపై కరీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ ప్రముఖుడు అర్బజ్‌ఖాన్ ‌షో “పించ్ బాయ్ అర్బజ్ ఖాన్” చిత్రీకరణ జరుగుతోంది. ఈ షో బుల్లితెరపై మార్చి 12న ప్రసారం కానుంది. ఈ షోకు సంబంధించిన ప్రోమోలో కరీనాను ఆంటీ అని పిలిచిన అభిమాని గురించి కరీనా మండిపడింది. ఈ విషయం గురించి కరీనా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఒక అభిమాని “ఇప్పుడు మీరు ఆంటీ అయిపోయారు. టీనేజర్ మాదిరిగా హడావుడి చేయకండి” అని అన్నారు. సెలబ్రిటీలకు ఫీలింగ్స్ ఉంటాయని, వారూ ఎమోషన్స్ కలిగివుంటారనే విషయాన్ని జనం పట్టించుకోరు. సెలబ్రిటీలు, నటులకు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవనుకొని, వారికి ఏది తోస్తే అది రాసేస్తుంటారు” అని కరీనా ఘాటైన సమాధానమిచ్చారు. పైగా ఆ అభిమాని కరీనా వయసువాడే కావడం గమనార్హం.

Related posts