telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్ళికి ముందు కరీనా పెట్టిన షరతు… హామీ ఇచ్చిన సైఫ్

Kareena-Kapoor

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ‘రెఫ్యూజీ’ సినిమాతో కరీనా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సహ నటుడు షాహిద్ కపూర్ తో చాలా కాలం డేటింగ్‌లో ఉంది క‌రీనా. మనస్పర్ధలు రావడంతో వీరు విడిపోయారు. కొన్నాళ్ల‌ తర్వాత కరీనా.. సైఫ్ అలీ ఖాన్‌‌తో బంధం ఏర్పడింది. సైఫ్, కరీనా 2012లో రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరికి 2016లో తైమూర్ పుట్టాడు. మరి వీరిద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? అనే ప్రశ్నకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరీనా సమాధానం చెప్పింది. “తషాన్ సినిమా కోసం గ్రీస్ వెళ్లాం. అప్పుడు ఒక రోజు సైఫ్ నా దగ్గరకు వచ్చి ‘పెళ్లి చేసుకుందామా?’ అని అడిగాడు. అప్పుడు నేను తిరస్కరించాను. లఢక్‌లో మరోసారి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. ఆలోచించుకుని చెబుతానని చెప్పా. బాగా ఆలోచించి ఓకే చెప్పా. అయితే పెళ్లైనా, పిల్లలు పుట్టినా వృత్తిని మాత్రం కొనసాగిస్తానని, ఆ విషయంలో అడ్డు చెప్పకూడదని కండీషన్ పెట్టా. దానికి సైఫ్ ఆనందంగా ఒప్పుకున్నాడు. వృత్తి విషయంలో తనుగాని, తన కుటుంబ సభ్యులుగాని ఎలాంటి ఇబ్బందీ పెట్టరని సైఫ్ హామీ ఇచ్చాడు. ఆ తర్వాతే సైఫ్‌ను పెళ్లి చేసుకున్నాన`ని కరీనా చెప్పింది.

Related posts