telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మనసు ఉంటె.. మార్గం ఇలా అని నిరూపించిన .. యువకుడు అబ్దుల్‌నబీ…

karate talented person abdul nabhi

ఓ యువకుడు ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. చిన్నపాటి డబ్బాలో పొగాకు అమ్ముకుంటూ కరాటేలో ప్రతిభకనబర్చి ఉన్నతస్థాయి వ్యక్తుల నుంచి మన్ననలు పొందుతున్న ఓ నిరుపేద యువకుడు అబ్దుల్‌నబీ. కొత్తకోట పట్టణ కేంద్రానికి చెందిన సుల్తాన్‌బీ, ఖాజామియ్యా దంపతుల కుమారుడు అబ్దుల్‌ నబీ చిన్నప్పుడు సరదాగా పంచ్‌లు విసిరిన చేతులే నేడు పట్టెడన్నం పెడుతున్నాయి. ఓ పేదింటి యువకుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రశంసలు పొందుతున్నాడు. నబీ తల్లి బీడీ కారి్మకులు కాగా తండ్రి పొగాకు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుండేవారు. తాను నేర్చుకున్న విద్య నలుగురికి నేర్పుదామని 2015లో ‘గాడ్స్‌ ఆన్‌ వారియర్స్‌ షోటోఖాన్‌ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో కిక్‌ బాక్సింగ్‌ అకాడమీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అకాడమీలో 500 మంది విద్యార్థులు కిక్‌ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.

ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది విద్యార్థులు తన దగ్గర శిక్షణ తీసుకున్నట్టు నబీ తెలిపాడు. ఇక్కడ శిక్షణ తీసుకున్న విద్యార్థులు తక్కువ కాలంలోనే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని పలుమార్లు బంగారు, వెండి పతకాలు సాధించారు. తన దగ్గర శిక్షణ తీసుకున్న విద్యార్థులు పోలీస్, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ తదితర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరికొందరు ప్రైవేట్‌ పాఠశాలల్లో పీఈటీలుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక పోటీల్లో పతకాలు అందుకున్నాడు. ఒలింపిక్స్‌లో ఆడించడమే లక్ష్యం నేను నేర్చుకున్న కరాటేలో అన్నిస్థాయిల్లో మంచి ప్రతిభకనబర్చుతూ మేధావుల నుంచి ప్రశంసలు పొందిన అబ్దుల్‌నబీ రాబోయే రోజుల్లో తన అకాడమీ విద్యార్థులను ఒలింపిక్‌ క్రీడల్లో ఆడించడమే నా లక్ష్యం. ప్రభుత్వం కరాటేను ఆదరించి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కరాటే నేరి్పంచేందుకు మాలాంటి వారికి ఉద్యోగావకాశాలు కలి్పంచాలి.

Related posts