telugu navyamedia
సినిమా వార్తలు

నైట్ ఫ్రీగా ఉంటావా ? 50 వేలు జీతం ఇస్తా అన్నారు : కరాటే కళ్యాణి

Karate-Kalyani

పలు తెలుగు సినిమాల్లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి ప్రేక్షకులకు సుపరిచితమే. రవితేజ నటించిన కృష్ణ సినిమాలో బ్రహ్మానందంతో పాటు ఆమె నటించిన పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో పోటీ చేసి ఈసీ మెంబర్ గా ఎన్నికయ్యారు కరాటే కళ్యాణి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన కెరియర్ ప్రారంభముల్ ఓ నటుడు తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని, నెలకు 50 వేలు జీతం ఇస్తాను… నేను ఏది చెబితే అది చేయాలి… అందుకుగానూ బాండ్ రాయమని అడిగాడని షాకింగ్ కామెంట్స్ చేసింది కళ్యాణి. తాను కుదరదని చెప్పడంతో తన ఇల్లు ఖాళీ చేయించాడని, ఆ తరువాత 600 రూపాయల అద్దెతో మరో కొత్త ఇంటికి మారినట్లు తెలిపింది. ఆ నటుడు ఇప్పుడు ఫేడ్ అవుట్ అయ్యాడని, అప్పట్లో అతడు చెప్పినట్లు చేసి ఉంటే ఇప్పుడు ఇంత ధైర్యంగా ఈ విషయాన్ని చెప్పేదాన్ని కాదని పేర్కొంది. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నైట్ ఫ్రీగా ఉంటావా ? బయటకు వెళదామా ? అని అడిగేవారని, సరదాకే కదా అని తాను కూడా వాళ్ళతో వెళ్లేదాన్నని, కానీ అలా బయటకు వెళ్ళాక వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే తాను ఎంకరేజ్ చేసేదాన్ని కాదని, తాను టాలెంట్ ను నమ్ముకునే ఇండస్ట్రీకి వచ్చానని కళ్యాణి చెప్పుకొచ్చింది.

మన కట్టు, బొట్టు, మాట్లాడే విధానాన్ని బట్టే అవతలి వారి ప్రవర్తన ఉంటుందని, ఎవరైనా ఆఫర్ ఇస్తాను రమ్మని అడిగితే వారికి ముందుగానే మన అభిప్రాయాలూ తెలియజేయాలని, ముందు మనం స్ట్రాంగ్ గా ఉంటే ఎలాంటి ఇబ్బందుకు ఎదురుకావని, క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు అమ్మాయిలు పనిచేసే ప్రతి చోటా ఉంటుందని చెప్పుకొచ్చింది కళ్యాణి.

Related posts