telugu navyamedia
రాజకీయ వార్తలు

కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంలో విచారణ

supreme court two children petition

కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాల ఘట్టం సుప్రీంకోర్టుకు చేరింది. తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించకపోవడంతో రెబల్ ఎమ్మెల్యేలంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. దాదాపు గంట పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. రెబల్ ఎమ్మెల్యేల తరుపున సీనియర్ న్యాయమూర్తి ముకులు రోహత్గి, స్పీకర్ తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ కావాలనే ఆమోదించట్లేదంటూ రోహత్గి ఆరోపించారు.

రోహిత్గి చెప్పిన విషయాలన్నీ అవాస్తవమని, న్యాయస్థానానికి స్పీకర్ విచక్షణాధికారాల్లో జోక్యం చేసుకునే అధికారం లేదని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా కలవకుండానే ముంబయి వెళ్లి అక్కడి నుంచి సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఈ నేపథ్యంలో స్పీకర్ అనర్హత వేటుకే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని సింఘ్వి తన వాదనను వినిపించారు. ఇరు వాదనలు విన్న అనంతరం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి స్పందిస్తూ రాజీనామాలపై వారం లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.

Related posts