telugu navyamedia
telugu cinema news trending

బాలీవుడ్ బుల్లితెరపై ప్రభాస్ ను ఇబ్బంది పెట్టబోతున్నారా ?

prabhas-and-karan-johar

“బాహుబలి” చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రభాస్ మాత్రమే కాదు చిత్రబృందం మొత్తానికి మంచి గుర్తింపు లభించింది. బాలీవుడ్ లో కూడా ప్రభాస్ కు క్రేజ్ పెరిగిపోయింది. బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా రాబోయే తదుపరి సినిమాలను కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నిర్మాత కరణ్ జోహార్.

అసలు విషయంలోకి వస్తే… బాలీవుడ్ బుల్లితెరపై కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పాపులర్ రియాలిటీ షో కాఫీ విత్ కరణ్. ప్రస్తుతం ఈ షో ఆరవ సీజన్ నడుస్తోంది. ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్ సెలెబ్రిటీలు మాత్రమే కన్పించారు. తొలిసారిగా ఈ షోలో సౌత్ ఇండియా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి, రానా కన్పించబోతున్నారని సమాచారం. ఈ నెలాఖరులోపు బాహుబలి టీం ఈ షోలో ఎప్పుడు పాల్గొంటుందనే విషయం తెలియనుంది. అదే గనుక నిజమైతే ఈ షోలో ప్రభాస్ ను అనుష్కతో ప్రేమ, పెళ్ళి విషయాలపై వచ్చే ప్రశ్నలు ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు.

Related posts

నటి ఝాన్సీ మృతి కేసు : ప్రియుని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఫోన్ స్వాధీనం..

vimala p

జనవరి మొదటి వారంలోనే… పంచాయతీ…

vimala p

అర్హులైన వారికీ ఇళ్ళు .. ప్రణాళిక సిద్ధం…మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

vimala p