telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు : కరణ్ జోహార్

Karan-Johar

బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు విషయంలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న డ్రగ్స్ ఆరోపణలను కరణ్ జోహర్ ఖండిస్తూ 2019 జూన్ లో తాను ఇచ్చిన పార్టీలో డ్రగ్స్ వాడలేదని అధికారిక ప్రకటన విడుదల చేశాడు. తానెప్పుడు డ్రగ్స్ తీసుకోలేద‌ని, మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని కొట్టిపారేశారు. ఈ పార్టీలో ఎవరూ ఎలాంటి డ్రగ్స్‌ తీసకోలేదని చెప్పుకొచ్చారు. డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలు న్నాయంటూ వస్తున్న ఆరోపణలు తనను, తన ఫ్యామిలీని బాధిస్తున్నాయని స్టేట్‌మెంట్ ఇచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar) on

అయితే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్షితిజ్‌ప్రసాద్, అనుభవ్‌ చోప్రాతో తనకు వ్యక్తిగత సంబంధాలేవి లేవని చెప్పారు. వీరిద్దరూ ధర్మా ప్రొడక్షన్‌లో ఉద్యోగులు కూడా కాదని చెప్పారు. అనుభవ్‌ చోప్రా కేవలం రెండు నెలల పాటు ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారన్నారు. డ్రగ్స్ లింకులకు, 2019 నవంబర్‌లో జరిగిన పార్టీయే సెంటర్‌పాయింట్ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు కరణ్‌జోహర్. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత డ్రగ్ కేసు బయటకు రావడంతో ఆ పార్టీ వీడియో తిరిగి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో దీపికా, రణ్‌బీర్, షాహిద్, వరుణ్ ధావన్, మలైకా అరోరా, అర్జున్ కపూర్ తదితరులు ఉన్నారు.

కాగా సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో ఈ డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపైన ఎన్‌సిబి విచారణ చెప్పట్టింది.. అయితే ఈ కేసులో ముందు నుంచి కీలక సూత్రధారిగా ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్‌సిబి అధికారులు అరెస్ట్ చేసింది.. ఇక ఈ విచారణలో రియా చిత్ర పరిశ్రమకు చెందిన 25 మంది సెలబ్రిటీల పేర్లను చెప్పినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రియా చెప్పినట్టుగా ఎన్‌సిబి కూడా అధికారికంగా పలువురు పేర్లను వెల్లడించింది. అందులో రకుల్ ప్రీత్ సింగ్, దీపికా, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌ పేర్లు ఉన్నాయి.. నిన్న (గురువారం) రకుల్ ప్రీత్ సింగ్ ని సుమారుగా నాలుగు గంటల పాటు ఎన్‌సిబీ విచారించింది. ఇవాళ మరో ముగ్గురిని ప్రశ్నించనున్నారు. అందులో భాగంగా దీపికా పదుకొణె నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణకు హాజరైంది. తన మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌తో కలిసి ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి శనివారం ఉదయం 9.45 గంటలకు చేరుకుంది దీపికా. ఆమె నుంచి అధికారులు పలు వివరాలను రాబట్టారు. అయితే ఆమె చెప్పిన సమాధానాలతో అధికారులు సంతృప్తి చెందలేదని, ఆమె ఫోనును అధికారులు సీజ్ చేసినట్లు తెలిసింది. డ్రగ్స్‌ కేసులో దీపికతో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఇప్పటికే ప్రశ్నించిన అధికారులు ప్రస్తుతం శ్రద్ధా కపూర్‌ను ప్రశ్నిస్తున్నారు. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి శ్రద్ధాకపూర్ వచ్చింది.

Related posts