• Home
  • Trending Today
  • నేనెదనుకున్నా ఆ ముగ్గురే నాకు ఫస్ట్… కరణ్ జోహార్
Trending Today వార్తలు సినిమా వార్తలు

నేనెదనుకున్నా ఆ ముగ్గురే నాకు ఫస్ట్… కరణ్ జోహార్

kuch kuch hota hai 2

ధర్మ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిత్యం ఎదో ఒక వార్తతో సామజిక మాద్యమాల్లోనో, వార్తల్లోనో నిలుస్తారు… తాజాగా బాలీవుడ్ ప్రేమజంట రణ్బీర్ కపూర్- అలియా భట్, జాన్వీ కపూర్ ఈ ముగ్గురినే తన ఫస్ట్ చాయిస్ గా ఎంచుకుంటున్నానన్నారు… యువత మెచ్చేవిధంగా, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తన సినిమాలను నిర్మిస్తూ ఎన్నో హిట్లను సొంతం చేసుకున్న ఈ దర్శక నిర్మాత కబీ ఖుషి కబీ గమ్, కుచ్ కుచ్ హోతా హై లాంటి ట్రేండింగ్ సినిమాలకు దర్శక నిర్మాతగా వ్యవహరించాడు.. ఆ సినిమాల ద్వారా తన ప్రతిభను చాటుకున్న కరణ్ జోహార్ ప్రస్తుతం రేడియో జాకీగా కొత్త అవతారం ఎత్తారు…

kuch kuch hota hai 2

20 ఏళ్ల క్రితం బాలీవుడ్ యువ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాను సీక్వెల్ తీస్తే… బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వివాదం విషయంపై మీ అభిప్రాయం చెప్పాలని ఓ అభిమాని ప్రశ్నించగా… ఒకవేళ ఆ సినిమా ప్రాజెక్ట్ గనక కార్యరూపం దాలిస్తే రణ్బీర్ కపూర్, అలియా భట్, జాన్వీ కపూర్లతోనే ‘కుచ్ కుచ్ హోతా హై-2′ సినిమా ఉంటుందని సమాధానమిచ్చారు… కాగా ఆ సినిమాలో ఏయే పాత్రలో ఎవరు నటించనున్నారు అన్న విషయం మాత్రం చెప్పలేదు… అప్పట్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు స్మార్ట్ బాయ్ షారూక్ ఖాన్, కాజోల్, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లోకనిపిస్తూ తెరకెక్కిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘కుచ్ కుచ్ హోతా హై’ ఆ సినిమా ఎంతగా హిట్ అయిందంటే ఆ సినిమాకొచ్చిన క్రేజ్ ఇప్పటికి ఎవరు మర్చిపోలేదు..

Related posts

తల్లితో గొడవ పడుతుందని పక్కింటి మహిళను దారుణంగా హతమార్చిన వైనం…

nagaraj chanti

తియ్యటి రుచితో మేక మాంసం… కిలో ధర ఏంతో తెలుసా

nagaraj chanti

కొండగట్టు బస్ ప్రమాదంపై స్పందించిన ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్, కవిత

nagaraj chanti

Leave a Comment