telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అర్జున్ మేనల్లుడి “పొగరు”… ఫస్ట్ సాంగ్ రిలీజ్

Dhruv-Sarja

యాక్షన్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు, క‌న్నడ చిత్రసీమ‌లోని స్టార్ యాక్టర్లలో ఒక‌రైన ధృవ స‌ర్జా హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియ‌న్ ఫిల్మ్ ‘పొగ‌రు’. తెలుగులోనూ ఇదే టైటిల్‌తో వస్తోంది. హ్యాట్రిక్ యాక్షన్ ప్రిన్స్‌గా పేరుపొందిన ధృవ స‌ర‌స‌న నాయిక పాత్రను ర‌ష్మికా మంద‌న పోషిస్తున్నారు. యాక్షన్ ఎంర‌ట్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ‘పొగ‌రు’కు నంద‌కిశోర్ ద‌ర్శకత్వం వ‌హిస్తున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్‌గా 100కు పైగా చిత్రాల‌ను పంపిణీ చేసి, ‘అధ్యక్షా’ వంటి హిట్ మూవీని నిర్మించిన బి.కె. గంగాధ‌ర్ ‘పొగ‌రు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని మొద‌టి పాట ‘ఖరాబు’ను గురువారం యూట్యూబ్‌లో విడుద‌ల చేశారు. ఈ పాట విడుద‌ల‌తో తెలుగు వెర్షన్ ప్రమోష‌న్స్‌ను ప్రారంభించారు. పాపుల‌ర్ క‌న్నడ మ్యూజిక్ డైరెక్టర్ చంద‌న్ శెట్టి స‌మ‌కూర్చిన మాస్ బీట్స్ ఉర్రూత‌లూగించే విధంగా ఉన్నాయి. ఈ పాటకు భాస్కరబట్ల రవి కుమార్ సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ముర‌ళి కొరియోగ్రఫీ అందించారు. సంప‌త్ రాజ్‌, ధ‌నంజ‌య్‌, ర‌విశంక‌ర్‌, ప‌విత్రా లోకేష్‌, గిరిజా లోకేష్ వంటి ప్రముఖ న‌టులు న‌టిస్తోన్న ఈ చిత్రంలో ‘డ‌బ్ల్యుడ‌బ్ల్యుఈ’ సూప‌ర్‌స్టార్లు కై గ్రీన్‌, మోర్గాన్ ఆస్టే, జో లిండ్నర్‌, జాన్ లూకాస్ కూడా న‌టిస్తుండ‌టం విశేషం.

Related posts