telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

కాపులు బానిసలుగా బతకాలా.. రిజర్వేషన్ రద్దు పై ముద్రగడ ఫైర్!

ys jagan cm

అగ్రవర్ణ పేదలకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ లో కాపులకే 5 శాతం ఇవ్వలేమని ఏపీ సర్కారు  ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ ప్రభుత్వం పై  మండిపడ్డారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాపు రిజర్వేషన్ ఉత్తర్వులు జారీచేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ వ్యవహారం పై సీఎం జగన్ కు  ఈరోజు ముద్రగడ బహిరంగ లేఖ రాసిన , ఈ 5 శాతం రిజర్వేషన్ పై ఏ కోర్టు స్టే ఇచ్చిందో చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు.

కాపు జాతి ఎలాంటి కోరికలు, ఆశలు లేకుండా బానిసలుగా బతకాలా? అని ప్రశ్నించారు. కేవలం జగన్ ఇస్తామన్న రూ.2,000 కోట్లకు ఆశపడి కాపులు ఆయనకు ఓటేయలేదని స్పష్టం చేశారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏదైనా కోర్టు స్టే ఇచ్చి వుంటే 2024 వరకూ కాపుల హక్కులపై మాట్లాడకుండా నోటికి ప్లాస్టర్ వేసుకుంటానని ముద్రగడ సవాల్ విసిరారు.

Related posts