telugu navyamedia
సినిమా వార్తలు

భారీ పారితోషికం అందుకునే హాస్యనటుడు… తండ్రి కాబోతున్నాడు

Kapil Sharma And Ginni Chatrath To Welcome Their First Baby

ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకునే కమెడియన్ గా కపిల్ శర్మ కొనసాగుతున్నారు. ఆయన బెస్ట్ స్టాండప్ కమెడియన్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ లో స్థానం దక్కించుకున్నాడు.  కపిల్ శర్మ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోకు విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. ఎన్ని వివాదాలు ఎదురైనా కపిల్ శర్మ క్రేజ్ ని అడ్డుకోలేకున్నాయి. గత ఏడాది కపిల్ శర్మ తన ప్రియురాలు జిన్ని ఛత్రాత్ ని వివాహం చేసుకున్నాడు.

ప్రస్తుతం జిన్ని ఛత్రాత్ గర్భవతి. దీనితో కపిల్ శర్మ ఫ్యామిలీ సంతోషంలో మునిగితేలుతోందట. కపిల్ శర్మ సహ నటి భారతి సింగ్ అతడి భార్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కపిల్ శర్మ ఆరోగ్యం విషయంలో ఛత్రాత్ చాలా కేర్ తీసుకుంటుంట. కపిల్ శర్మ షూటింగ్ విషయంలో సమయపాలన పాటిస్తాడు. షూటింగ్ ముగియగానే ఇంటికి వెళ్ళిపోతాడు. నిజంగా అలాంటి భర్తని పొందిన ఛత్రాత్ అదృష్టవంతురాలు.

ఆ అదృష్టం కపిల్ శర్మది కూడా. ఎదుకంటే ఆమె ఎప్పుడూ కపిల్ శర్మని బయట భోజనం చేయనీయదు. ప్రతిరోజు ఇంటి భోజనమే సెట్స్ కు పంపుతుంది. ఆ క్రమంలో కపిల్ శర్మ ఇంటి నుంచి మాకు కూడా భోజనం అందుతుందని భారతి సింగ్ తెలిపింది. 

Related posts