telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

మనమంతా ఏకమైతే కరోనాపై యుద్ధంలో గెలుస్తాం: కపిల్ దేవ్

Kapil-Dev

మనమంతా ఏకమైతే కరోనాపై యుద్ధంలో గెలుస్తామని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అది జరగాలంటే ప్రజలంతా ప్రభుత్వం చెప్పినట్టు వినాలన్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరికీ ఇదే జీవనరేఖ అని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమందిని పొట్టనపెట్టుకున్న ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు కపిల్ మద్దతు తెలిపాడు.

తాను కూడా ఇంట్లోనే ఉన్నానని చెప్పిన కపిల్ రకరకాల పనులతో సేదతీరుతున్నానని చెప్పాడు. ‘మా ఇల్లు ఊడుస్తున్నా. గార్డెన్ శుభ్రం చేశా. మా ఇంట్లో ఉన్న చిన్న గార్డెనే ఇప్పుడు నా గోల్ఫ్ కోర్స్‌ అయింది. అలాగే, మా కుటుంబ సభ్యులతో గడిపేందుకు నాకిప్పుడు చాలా సమయం దొరికొంది. చాలా ఏళ్లుగా ఇలాంటి అవకాశాన్ని నేను కోల్పోయా. ఇంట్లో అందరికీ నేను వండి పెడుతున్నా. చాలా వంటకాలు చేస్తున్నా. ఇంగ్లండ్‌లో ఆడుతున్నప్పుడు నాతో పాటు ఉన్న రోమి (భార్య)తో వంట నేర్పించింది’ అని కపిల్ తెలిపాడు.

Related posts