telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్ లోకి కపిల్ దేవ్ కుమార్తె ఎంట్రీ

Kapil-Dev-with-his-Daughter

క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కుమార్తె అమీర్ సినీ రంగ ప్రవేశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 1983లో భారత్ మొదటిసారిగా ప్రపంచ కప్ ను గెలవడంతో అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ దే కీలకపాత్ర అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన జీవితం ఆధారంగా బాలీవుడ్ లో కబీర్ ఖాన్ దర్శకత్వంలో “83” అనే పేరుతో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ కనిపించనున్నారు. మే నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. ఇప్పటికే రణ్వీర్ సింగ్ చాలా రోజుల నుంచి క్రికెట్ ను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కపిల్ దేవ్ కూతురు అమియా బాలీవుడ్ అరంగ్రేటం చేయనున్నారు. అయితే అమియా హీరోయిన్ గా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఈ సందర్భంగా అమీయా మాట్లాడుతూ తనకు ఈ చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు.

Related posts