telugu navyamedia
సినిమా వార్తలు

రష్మిక మందన్నపై కన్నడిగులు ఫైర్

Rashmika

రష్మిక మందన్న ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో ఓ సినిమా చేస్తోంది. తమిళంలో కార్తీకి జంటగా నటిస్తోంది. మరో వైపు తన మాతృ భాషా కన్నడలో కూడా అవకాశాలను దక్కించుకుంటూ ముందుకుసాగుతోంది. ఈ ముద్దుగుమ్మ విజయ్‌దేవరకొండతో నటించిన డియర్‌ కామ్రేడ్‌ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌ కోసం రష్మిక, విజయ్‌లు సౌత్ ఇండియాలోని ఐదు రాష్ట్రాలను చుట్టేసి వచ్చారు. ఈ ప్రమోషన్‌లో పాల్గొన్న రష్మికను.. ఓ జర్నలిస్టు… కన్నడం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తున్నారు కదా… మరీ ఏ భాషలో మీకు నటించడం కష్టంగా ఉంటుంది అని అడిగాడు. ఈ ప్రశ్నకు రష్మిక.. టక్కున కన్నడ భాషలో మాట్లాడడం, నటించడం కష్టం అనిపిస్తోందని చేప్పేసింది. రష్మిక.. ఆ మాటతో ఆమె సొంత రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురైంది. కన్నడ భాషా సంఘాలు, భాషా అభిమానులు ఆగ్రహాం చెందుతూ.. మాతృభాషలో మాట్లాడడం కష్టంగా ఉందంటావా.. నువ్వు ఎలా కన్నడ సినిమాలు చేస్తావో చూస్తాం.. అంటూ రష్మికపై మండిపడుతున్నారు. అయితే దీనిపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Related posts