telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సిల్క్ స్మిత చనిపోయే ముందు రోజు ఆస్టార్ హీరోకి కాల్ చేసిందట…

ravichandran

సిల్క్ స్మిత మ‌ర‌ణం ఇప్ప‌టికే అంతుచిక్క‌ని మిస్ట‌రీనే. చాలా త‌క్కువ వ‌య‌సులోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం వెనక ఎన్నో చీక‌టి ర‌హ‌స్యాలు ఉన్నాయ‌ని చెప్పుకుంటూ ఉంటారు. సిల్స్ స్మిత‌ జీవిత క‌థాశంతో డ‌ర్టీ పిక్చ‌ర్ అనే సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే అయితే తాజాగా సిల్క్ స్మిత స్నేహితుడు.. కన్నడ సూపర్ స్టార్ రవిచంద్రన్ ఆమె మ‌ర‌ణానికి ముందు రోజు జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు బ‌య‌ట‌కు చెప్పారు.1992లో సిల్క్ స్మిత, రవిచంద్రన్ కలిసి హల్లి మేస్త్రు అనే చిత్రంలో న‌టించారు. అప్పట్నుంచే వీళ్లు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆమె చనిపోయే ముందు వ‌ర‌కు కూడా ఈ స్నేహం కొన‌సాగింది. స్మిత తనతో ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేద‌ని.. అలాగే తానూ ఆమె పట్ల గౌరవంగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు రవి. ఈమె చనిపోయే ఒక్కరోజు ముందు తనకు ఫోన్ చేసిందని చెప్పాడు ఈ న‌టుడు. ఆమె డిప్రెష‌న్ లో తనను కలవాలని ప్రయత్నించిందేమో కానీ.. అది వీలుప‌డ‌లేద‌ని గుర్తు చేసుకున్నాడు. ఓ షూటింగ్‌లో ఉన్నందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయానని..లేక‌పోతే దారుణం జ‌రిగిఉండ‌క‌పోయేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. అదేదో రెగ్యుల‌ర్ కాల్ అనుకున్నా అందుకే మళ్లీ కాల్ చెయ్య‌లేద‌ని చెప్పాడు రవిచంద్రన్. 1996 సంవత్సరం సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత తనకు కాల్ చేసింది. ఆ తర్వాత రోజే ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పాడు రవిచంద్రన్. సిల్క్ స్మిత‌ చనిపోవడం తనకు లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చేదు జ్ఞాపకం అని చెప్పాడు కన్నడ సూపర్ స్టార్ రవిచంద్రన్.

Related posts