telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సొంత కుంపటి పెట్టేసుకున్న.. కంగనారనౌత్…

kanganarout own studio started

బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ సొంత స్టూడియో నిర్మించాల ని పదేళ్ల కిందట తాను కన్న కలను సాకారం చేసుకుంది. ముంబైలోని పోష్‌ ఏరియా పాలి హిల్‌ ప్రాంతంలో తన ఫిల్మ్‌ స్టూడియోను కంగనా ప్రారంభించింది. మణికర్ణిక ఫిల్మ్స్‌ పేరిట ఏర్పాటు చేసిన ఈ స్టూడియోలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పూజ నిర్వహించింది. ఈ స్టూడియో కేంద్రంగా ఆమె దర్శక నిర్మాతగా వ్యవహరించనుంది. కంగనా స్టూడియోను ఇవాళ ప్రారంభించామని, స్టూడియో వ్యవహారాలను న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో ఫిల్మ్‌ ప్రొడక్షన్‌లో శిక్షణ పొందిన అక్షత్‌ పర్యవేక్షిస్తారని కంగనా సోదరి రంగోలి తెలిపింది.

నిజాయితీతో కష్టపడి పనిచేస్తే ప్రజలు ఏదైనా సాధించవచ్చని దాని కోసం చిల్లరమల్లర పనులు చేస్తూ నిజాయితీ లేకుండా ఎందుకు వ్యవహరించాలని స్టూడియో లాంఛింగ్‌ ఫోటోలను ట్వీట్‌ చేస్తూ వ్యాఖ్యానించారు. కంగనా తన సినీ ప్రస్ధానంలో కష్టపడి, నిజాయితీగా వ్యవహరిస్తూ మూవీ మాఫియాకు చెంపపెట్టులా పనిచేస్తూనే తగిన ఆస్తులనూ కూడబెట్టుకున్నారని ఇతర నటీమణులపై సెటైర్లు వేసింది.

Related posts