telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ సొందరికి ధన్యవాదాలు తెలిపిన కంగనా

Kangana

బాలీవుడ్ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ ప్రముఖులపై, నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజంపై ఆమె చేసిన వ్యాఖ్యలు, కొందరు బాలీవుడ్ ప్రముఖులపై నేరుగా ఆమె చేసిన కామెంట్లు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో కంగనాకు వ్యతిరేకంగా “బాయ్‌కాట్ కంగన” హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో కంగన గురించి సుశాంత్ ఫ్యామిలీ లాయర్ మాట్లాడిన వీడియోను శ్వేత షేర్ చేసింది. “మాకెవరికీ కంగనపై ఎలాంటి ఫిర్యాదులూ లేవు. సినీ పరిశ్రమలోని వివక్ష గురించి కంగన పోరాటం చేస్తోంది. సుశాంత్ కూడా ఆ వివక్ష బాధితుడే. అయితే సుశాంత్ మరణానికి, బాలీవుడ్‌లోని వివక్షకు ప్రత్యక్ష సంబంధం లేదని నేను గతంలో అన్నాను. ఒకవేళ సుశాంత్ మరణానికి అదే కారణమైతే సీబీఐ చూసుకుంటుంది” అని ఆయన పేర్కొన్నారు. ఆ వీడియోపై కంగనా స్పందిస్తూ ‘ధన్యవాదాలు శ్వేతా సింగ్. నా గురించి వస్తున్న అన్ని రూమర్లకు సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు’ అని కంగనా ట్వీట్ చేసింది.

Related posts