telugu navyamedia
సినిమా వార్తలు

తాకరాని చోట తాకారు : కంగనా రనౌత్ 

Kangana Ranaut images
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తన వివాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఉధృతంగా సాగుతుండగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, నిర్మాత వికాస్ బెహెల్ లు తన పట్ల ప్రవర్తించిన తీరు గురించి మీడియా ముందు ధైర్యంగా వెల్లడించింది. అయితే ఈ విషయంలో ఆమెకు సినిమా ప్రముఖుల నుంచి వ్యక్తిరేకత లభించింది. కొంత వరకు మద్దతు లభించింది. ఈ విషయాన్నీ పక్కన పెడితే తాజాగా మరోసారి కంగనా మీటూకు సంబంధించిన వ్యాఖ్యలు చేసింది.
”ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు పబ్లిక్ లోనే ఓ వ్యక్తి తాకరాని చోట తాకుతూ నన్ను గిల్లాడు. ఇప్పుడు ఏం చేయగలవు అన్నట్లుగా అతడు చూసిన చూపుతో నాకు చిరాకు వచ్చింది. ఆడపిల్లల రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఓ చర్చా వేదికలో రాణీముఖర్జీ చెప్పారు. ఆమె చెప్పింది నిజమే… మీటూ ప్రభావం చిత్ర పరిశ్రమలో బాగా ఉంది. నటీనటులతో అసభ్యంగా ప్రవర్తించే వారు ఉంటారు. ఆడపిల్లల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది” అంటూ తెలిపింది. కంగనా ప్రధాన పాత్రలో నటించిన “మణికర్ణిక” సినిమా ఈనెల 25న విడుదలకు సిద్ధంగా ఉండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు.

Related posts