telugu navyamedia
సినిమా వార్తలు

బాలకృష్ణపై కంగనా రనౌత్ కామెంట్స్

Kangana-ranauth-and-balakrishna

దర్శకుడు క్రిష్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. “మణికర్ణిక” సినిమాకు సంబంధించిన పూర్తి క్రిడిట్ తనకు ఇవ్వలేదంటూ క్రిష్, సినిమా క్రెడిట్ మొత్తం తనకే దక్కుతుందని కంగనా… ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఇక ఇప్పుడు తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ ప్రేక్షకులను, చిత్రబృందాన్ని నిరాశ పరిచాయి. ఈ విషయంపై తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్లు జీరో రికవరీగా మిగిలాయని విన్నాను. బాలకృష్ణ కెరీర్ లో ఈ సినిమా ఓ మచ్చగా మిగులుతుంది. క్రిష్ ను నమ్మిన బాలకృష్ణను చూస్తుంటే బాధగా ఉంది. క్రిష్ కు ద్రోహం చేసానని నన్ను విమర్శించేవారు ఇప్పుడేం సమాధానం చెప్తారు ? అంటూ ప్రశ్నించింది. అంతేకాదు “మణికర్ణిక” సినిమా హిట్ టాక్ తో విమర్శల ప్రశంసలు సైతం అందుకుంది. అలాంటి సినిమాపై విమర్శలు చేస్తారా ? అంటూ ఫైర్ అయ్యింది కంగనా.

Related posts