telugu navyamedia
సినిమా వార్తలు

“మణికర్ణిక”కు కర్ణిసేన హెచ్చరిక… వదలనంటున్న కంగనా

Kangana Ranaut images
ఝాన్సీరాణి లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం “మణికర్ణిక”. ఈ సినిమాకి క్రిష్ దర్శకుడిగా వ్యవహరించి ఆ తరువాత తప్పుకున్నారు. దీంతో కంగనానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేసింది. ఈ సినిమా జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాను అడ్డుకునేందుకు మహారాష్ట్ర కర్ణిసేన సన్నాహాలు చేసుకుంది. కర్ణిసేన బ్రిటిష్ రాజుతో ఝాన్సీ లక్ష్మి బాయ్ సన్నిహితంగా ఉన్నట్లు సినిమాలో చూపించినట్లు కర్ణిసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. 
అయితే ఈ విషయంపై కంగనా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. నేను కూడా రాజ్ పుత్ నే అంటూ చెప్తున్న కంగనా ఎంత చెప్పినా ఇలాగే వేధిస్తే ఎవరిని వదిలిపెట్టను అంటూ కర్ణిసేనపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇంతకుముందే నలుగురు చరిత్రకారులకు సినిమాను చూపించామని, సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ ను కూడా పొందామని, కర్ణిసేనకు కూడా ముందునుంచే సినిమాపై వివరణ ఇస్తూ వస్తున్నట్లు చెప్పుకొచ్చింది కంగనా. కర్ణిసేన గతంలో కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటించిన చారిత్రాత్మక చిత్రం “పద్మావత్”పై ఇలాగే అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా ఆ సినిమా విడుదలై భారీ ప్రభంజనాన్ని సృష్టించింది. 

Related posts