telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా ఇల్లు కూల్చి ఆనందపడుతున్నారు… మీ అహంకారం కూలే రోజు దగ్గర్లోనే ఉంది : కంగనా

kangana

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సుశాంత్ కేసుకు సంబంధించిన విచారణలో పోలీసుల తీరును తప్పుబట్టడమే గాక ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తలపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ ఇష్యూ పలు వివాదాలకు దారితీసింది. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం హిమాచల్ ప్రదేశ్ నుంచి బయల్దేరిన కంగనా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ముంబైలో ల్యాండ్ అయింది. కంగనా వస్తుందని తెలిసి పోలీసు శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. కంగనా సవాల్‌పై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టులో భారీగా పోలీసులు మోహరించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వై క్యాటగిరి భద్రతతో కొద్ది సేపటి క్రితమే కంగన రనౌత్‌ ముంబై ఎయిర్‌పోర్టులో దిగింది. మరోవైపు కర్ణిసేన కార్యకర్తలు కూడా కంగనాకు సెక్యూరిటీగా ఉన్నారు. మొత్తానికి ముంబైలో అడుగుపెట్టిన కాంట్రవర్సీ క్వీన్ కంగనా హై సెక్యూరిటీ నడుమ తన నివాసానికి చేరుకుంది.
ముంబైలో అడుగు పెట్టీ పెట్టగానే శివసేనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది కంగనా రనౌత్. “నా ఇల్లు కూల్చి ఆనందపడుతున్నారు. మీ అహంకారం కూలే రోజు దగ్గర్లోనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. కశ్మీర్ పండితుల బాధేంటో నాకు ఈరోజు ఆర్థమైంది” అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. తన కార్యాలయాన్ని కూల్చుతున్న ఫొటోలను ట్విట్టర్ షేర్ చేసిన కంగనా బాబర్‌, అతని సైన్యం అంటూ కూల్చివేతకు వచ్చిన సిబ్బందిని ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఆ భవనాన్ని కంగనా ఇటీవలే రూ.47 కోట్లతో కొనుగోలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మించారని బీఎంసీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి కంగనాకు నోటీసులు సైతం పంపించారు. అయితే ఆ సమయంలో కంగనా అక్కడ లేరు. ఆమె ముంబై చేరుకునే లోపే ఆమె కార్యాలయాన్ని కూల్చారు.

Related posts