telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కంగనా రనౌత్ : వర్మ

RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన కంగనా వర్సెస్‌ మహారాష్ట్ర విషయంపై స్పందించాడు. ఈ మేరకు ట్విటర్‌లో ఆసక్తికర పోస్టు చేశారు. “ఖచ్చితంగా మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కంగనా రనౌత్‌ అవుతుందనిపిస్తోంది. ఒకవేళ అదే గనుక జరిగితే బాలీవుడ్‌ వాళ్లందరూ టింబక్టుకు మకాం మార్చాలి” అని ట్వీట్‌ చేశారు. (టింబక్టు అనేది నైజీర్‌ నదికి సమీపంలోని మలి అనే దేశంలోని ఓ నగరం). అంతేకాదు “కరోనా సోకిన భారత్‌కు వ్యాక్సిన్‌ లేదు. అలాగే కంగనా సోకిన శివసేనకు కూడా వ్యాక్సిన్‌ లేదు” అంటూ వ్యంగ్యంగా మరో ట్వీట్ చేశారు.

కాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సుశాంత్ కేసుకు సంబంధించిన విచారణలో పోలీసుల తీరును తప్పుబట్టడమే గాక ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తలపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ ఇష్యూ పలు వివాదాలకు దారితీసింది. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం హిమాచల్ ప్రదేశ్ నుంచి బయల్దేరిన కంగనా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ముంబైలో ల్యాండ్ అయింది. ఇదిలా ఉంటే నేటి ఉదయం ముంబై బంద్రాలో ఉన్న కంగనా రనౌత్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేసింది బీఎంసీ. అయితే ఈ కూల్చివేతపై స్టే విధించాలని బాంబే హైకోర్టును ఆశ్రయించిన కంగనాకు కాస్త ఊరట కలిగింది. కూల్చివేతపై స్టే విధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts