telugu navyamedia
telugu cinema news

“కాంచన-3” మా వ్యూ

Kanchana-3

బ్యానర్ : రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్, లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్‌
న‌టీన‌టులు : రాఘవ లారెన్స్‌, వేదిక‌, ఓవియా, నిక్కీ తంబోలి తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: రాఘ‌వ లారెన్స్‌
సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్
నిర్మాత‌: రాఘ‌వ‌

కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ హార్రర్ చిత్రాలను తెరకెక్కించడంలో తనదైన ప్రత్యేకతను చూపిస్తుంటారు. గతంలో లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన “కాంచన, కాంచన -2 చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో మరో సీక్వెల్ గా “కాంచన-3” చిత్రాన్ని రూపొందించారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ఆయనే ప్రధాన పాత్రలో నటిస్తున్న “కాంచన-3” ట్రైలర్ భయపెట్టే అంశాలతో పాటు కమర్షియల్ గా కూడా ఉంటూనే సినిమాపై అంచనాలు పెంచేసింది. కోలీవుడ్ లో మొదటిరోజు భారీగా రిలీజయిన కాంచన 3 అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్ సృష్టించింది. మరి తెలుగు తమ్ముళ్లను ఈ చిత్రం ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం.

క‌థ‌ :
సిటీలో రౌడి భ‌వాని (క‌బీర్ దుహ‌న్ సింగ్‌) అత‌ని మనుషులు కొంత మంది పోలీసుల‌ను హ‌త‌మారుస్తారు. మ‌రుస‌టి రోజు భ‌వాని, అత‌ని మ‌నుషుల‌ను కాళి (రాఘ‌వ లారెన్స్‌) ప్లాన్ వేసి చంపేస్తాడు. మ‌రో ప‌క్క ఓ వ్య‌క్తి త‌న కూతురికి ప‌ట్టిన దెయ్యాన్ని బంధించి మేకుల రూపంలో చెట్టుకు కొట్టించి వ‌చ్చేస్తాడు. సిటీలో ఉండే రాఘ‌వ‌ (రాఘ‌వ‌లారెన్స్‌), అత‌ని త‌ల్లి (కోవై స‌ర‌ళ), వ‌దిన‌ (దివ్య ద‌ర్శిని), అన్న కూతురుతో కలిసి సంతోషంగా జీవితాన్ని గ‌డుపుతుంటాడు. వరంగ‌ల్‌లో తాత‌య్య ష‌ష్టిపూర్తి కార్య‌క్ర‌మానికి బ‌య‌లుదేరుతాడు. మార్గ‌మ‌ధ్యంలో ఓ చెట్టు ద‌గ్గ‌ర ఆగుతారు. అనుకోకుండా అక్క‌డి చెట్టుకు కొట్టిన మేకుల‌ను ఆ కుటుంబం పీకేస్తుంది. ఆ మేకులు వారున్న బాక్సులో ప‌డిపోతాయి. వారు ఇంటికి వ‌చ్చేస్తారు. రాఘ‌వ తాత‌య్య ష‌ష్టిపూర్తికి వ‌చ్చిన త‌న మ‌ర‌ద‌ళ్లు (వేదిక‌, ఓవియా, నిక్కీ తంబోలి)ల‌తో సంతోషంగా ఆడిపాడుతుంటాడు. అయితే రాత్రి అవ‌గానే ఎవ‌రో తిరుగుతున్న‌ట్లు.. ఏడుస్తున్న‌ట్లు శ‌బ్దాలు వ‌స్తుంటాయి. ఇంట్లో వాళ్లు భ‌య‌ప‌డి అఘోరాను పిలిచి పూజ చేయిస్తారు. అయితే ఆ దెయ్యం వెళ్లిపోయిందా ? చివ‌ర‌కు కుటుంబ స‌భ్యులంద‌రూ వెళ్లి అఘోరాను క‌లిస్తే అఘోరా ఓ విష‌యం చెబుతాడు. అఘోరా చెప్పే విష‌యం ఏంటి ? అస‌లు కాళి ఎవ‌రు ? కాళి, రోసికి ఉన్న రిలేష‌న్ ఏంటి ? మినిష్ట‌ర్‌ను కాళి ఎందుకు చంపాల‌ని అనుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
కాంచ‌న‌, గంగ చిత్రాల్లో ముగ్గురు, న‌లుగురు ఆత్మ‌లున్న వ్య‌క్తిగా ఒకేసారి న‌టించిన లారెన్స్ ఈ సారి మాత్రం రెండు ఆత్మ‌లున్న శ‌రీరం ఎలా ఉంటుంద‌నే దాన్నే న‌ట‌న రూపంలో చూపించాడు. ఇక కామెడీ స‌న్నివేశాల్లో కోవై స‌ర‌ళ‌, దేవ‌ద‌ర్శిని, శ్రీమాన్ న‌ట‌న సూప‌ర్బ్‌గా ఉంది. ముఖ్యంగా దెయ్యం ఇంట్లో ఉందా? లేదా? అని క‌ని పెట్టే సన్నివేశాల్లో కామెడీ పీక్స్‌లో ఉంటుంది. ఓవియా, వేదిక‌, నిక్కీ కేవ‌లం ఓ సాంగ్‌.. బావ‌తో స‌ర‌సాలు అడ‌టానికే అన్న‌ట్లు ఉన్నారు. ఇక కాళి పాత్ర‌లో పాత్రను గొప్ప‌గా చూపించ‌డం ఏంటో అర్థం కాలేదు. మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
హార‌ర్ కామెడీలో ముని సిరీస్ ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. అందులో భాగంగా వ‌చ్చిన కాంచ‌న 3లో సినిమాలో హార‌ర్ఎలిమెంట్స్‌ను, కామెడీ ఎలిమెంట్స్‌ను వేటిని మిస్ కాకుండా చూసుకున్నాడు డైరెక్ట‌ర్, యాక్ట‌ర్ లారెన్స్‌. ఇంత‌కు ముందు హార‌ర్ స‌న్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ ప్ల‌స్ అయ్యింది. అలాగే స‌ర్వేష్ మురారి కెమెరా వర్క్‌, వెట్రి ప‌ళ‌నిస్వామి కెమెరా వర్క్ సినిమాకు ప్ల‌స్‌గా మారింది. పాట‌లు అస్స‌లు బాగాలేవు. ఇంత‌కు ముందు ఈ సిరీస్‌లో ఉన్న రివేంజ్ ఫార్ములానే ఈ సినిమాలో కూడా లారెన్స్ చూపించాడు. ఎప్ప‌టిలాగానే త‌దుప‌రి పార్ట్ కాంచ‌న 4(ముని 5) ఉంటుంద‌ని ఓ లీడ్ ఇచ్చేశాడు లారెన్స్‌.

రేటింగ్ : 2.75/5

Related posts

జగన్ కు అనుభవం లేదు… మార్పు మంచిదే… హీరో కామెంట్స్

vimala p

దేశంలోని రెండు కీలక వ్యవస్థలపై తనుశ్రీ సంచలన కామెంట్స్

vimala p

భారత్ : రొమాంటిక్ వీడియో సాంగ్

vimala p