telugu navyamedia
సినిమా వార్తలు

“కాంచన-3” ట్విట్టర్ టాక్

కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ హార్రర్ చిత్రాలను తెరకెక్కించడంలో తనదైన ప్రత్యేకతను చూపిస్తుంటారు. గతంలో లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన “కాంచన, కాంచన -2 చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో మరో సీక్వెల్ గా “కాంచన-3” చిత్రాన్ని రూపొందించారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ఆయనే ప్రధాన పాత్రలో నటిస్తున్న “కాంచన-3” ట్రైలర్ భయపెట్టే అంశాలతో పాటు కమర్షియల్ గా కూడా ఉంటూనే సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక కాంచన-3లో రాఘవ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. లారెన్స్ కు విలన్ గా కబీర్ సింగ్ నటిస్తున్నారు. ఓవియా, వేదిక ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్ లో మొదటిరోజు భారీగా రిలీజయిన కాంచన 3 అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్ సృష్టించింది. 
సినిమా ప్రీమియర్స్ ను ఎగబడి చూసిన అభిమానులు రాఘవ లారెన్స్ టాలెంట్ కి మరోసారి ఫిదా అయ్యారు. ట్విట్టర్ లో అయితే లారెన్స్ కాంచన-3కి మంచి ప్రశంసలు అందుతున్నాయి. సినిమా డబుల్ మాస్ అని అంటున్నారు. కామెడీ తో పాటు మంచి హారర్ థ్రిల్ గా ఉందట. గత ముని సీక్వెల్స్ కంటే ఇప్పుడు మాస్ యాక్షన్ సీన్ లో హై రేంజ్ లో ఉన్నాయని టాక్ వస్తోంది. ఇక సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో స్థాయిలో ఉందని చెబుతున్నారు. లారెన్స్ మరోసారి అద్భుతంగా కష్టపడ్డారని సినిమాటోగ్రఫీ కూడా మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు. ఇక కామెడీ అందిస్తూనే హారర్ సీన్స్, ఎమోషన్ సీన్స్ ని లారెన్స్ సమపాళ్లలో అందించాడని చెబుతున్నారు. మొత్తంగా లారెన్స్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించి ముని-5 పోస్టర్ ని కూడా వదలడంతో ఈ సీక్వెల్స్ కి ఎదురులేదని ఆడియెన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Related posts