telugu navyamedia
సినిమా వార్తలు

“కాంచన-3” నటిపై లైంగిక వేధింపులు

Kanchana-3-Actress

ఇటీవల రాఘవ లారెన్స్ తెరకెక్కించిన “కాంచన-3” సినిమాలో కన్పించిన రష్యా అమ్మాయి అందరినీ ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ తనపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రష్యాకు చెందిన 34 ఏళ్ల మహిళ తన భర్త పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం చెన్నైకి వచ్చింది. స్థానిక ఎంఆర్సీ నగర్ లో నివసిస్తూ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. ఆమెతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన రుబేశ్ కుమార్ అనే 26 ఏళ్ల యువకుడు వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి రుబేశ్ పలు భంగిమల్లో ఫోటోలు తీసినట్లు ఆమె చెప్పింది. ఆ తరువాత ఆ ఫోటోలను వాట్సాప్ చేసి, తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. తన కోరిక తీర్చకపోతే ఆ ఫోటోలను ఇంటర్నెట్ లో విడుదల చేస్తానని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు మాధవరం, పొన్నియమ్మన్ మేడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

Related posts