telugu navyamedia
సినిమా వార్తలు

కనక పరిమళాలు…

bhuvi devi poetry corner

కనక అంబరమై
పసిడి కాంతులు
వేదజల్లుతూ
ప్రకృతి లోకంలో
కనక పరిమళాలుగా
ఆనందాల పూదోటలై
చిరునవ్వులు చిందిస్తూ
వాలు చూపులు చూడగా
నీ చూపుల మాయలో పడి
నీ ఆకర్షణకు ముగ్దుడై
నీకు దాసుడనైపోయాను
నీ కౌగిలిలో బందీనై
నిత్య సేవకుడై
నీ సేవలో తరించి
నాజోకు మంత్రాలు
నామీద వేదజల్లి
నీ సొంతం 
చేసుకున్నావు

-శివేగారి చిన్నికృష్ణ,
చిత్తూర్ జిల్లా.

Related posts