telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దీపావళికి వర్మ ట్రీట్… “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అప్డేట్

KRKR

వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మరాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా తీయబోతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. క్యాస్ట్ ఫీలింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు. కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఇప్పటికే “కమ్మరాజ్యంలో కడపరెడ్లు” అనే టైటిల్‌తో కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను పోలిన లుక్స్ విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చారు వర్మ. దీపావళి సందర్భంగా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 27న ఉదయం 9.36 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు వర్మ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఒక పోస్టర్‌ కూడా వదిలారు. ఈ పోస్టర్‌లో జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ పాత్రలు ఉన్నాయి. మొత్తం మీద దీపావళి రోజు వర్మ రచ్చ చేయబోతున్నారు. ఈ ట్రైలర్ మరెన్ని వివాదాలకు తెరలేపుతుందో చూడాలి.

Related posts