telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వాషింగ్టన్‌ : .. అధ్యక్ష ఎన్నికల నుండి .. తప్పుకున్న కమలా హారిస్‌…

kamala haris out from america president election

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి డెమోక్రటిక్‌ అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ తప్పుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆమె మంగళవారంతో ముగించారు. నా మద్దతుదారులకు ఇది చాలా విచారకరం. ఈ రోజు నేను నా ప్రచారాన్ని నిలిపివేస్తున్నాను. కానీ మీతో ఒక విషయం స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటానని కమలా హ్యారిస్‌ ట్వీట్‌ చేశారు. తను తీసుకున్న నిర్ణయం చాలా కష్టతరమైనదని ఆమె పేర్కొన్నారు. అంతకు ముందు ఆమె తన సీనియర్‌ సిబ్బందికి ఈ నిర్ణయం గురించి తెలిపారు. అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. డెమోక్రటిక్‌ పార్టీలో కీలక నేతగా మారిన కమలా హ్యారీస్‌ ఒకానొక సమయంలో అధ్యక్ష పదవికి ప్రముఖ పోటీదారుగా నిలిచారు.

ఆమె అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి ఆర్థిక ఒత్తిళ్లే కారణమని ఆమె తెలిపారు. నేను బిలియనీర్‌ను కాదు. సొంత ప్రచారానికి నిధులు సమకూర్చుకునే పరిస్థితుల్లో లేను. ప్రచారం కొనసాగుతున్న కొద్దీ, మనం పోటీ పడటానికి అవరసరమైన నిధులు సేకరించడం కష్టంతో కూడుకున్న పని..అని అమె తన మద్దతుదారులకు తెలిపారు. న్యూయార్క్‌ మేయర్‌ మైక్‌ బ్లూమ్‌బర్గ్‌ రంగంలోకి దిగిన తర్వాత హ్యారిస్‌కు మద్దతు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. సెనెటర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా కమలా హారిస్‌ చరిత్రకెక్కారు.

Related posts