telugu navyamedia
సినిమా వార్తలు

నిజమే… ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనున్న కమల్ హాసన్

Kamal-Hassan

లోకనాయకుడు కమల్ హాసన్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు రాజకీయ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఇప్పుడు కమల్ హాసన్ “భారతీయుడు-2” సినిమాలో నటిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. ఇక ఈ సినిమా తరువాత సినిమాలకు స్వస్తి చెబుతానని, తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని కమల్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే అభిమానులు మాత్రం ఈ విషయాన్ని నమ్మలేదు. ఇప్పుడు మరోసారి కమల్ ఈ విషయంపై స్పందించారు. తాజాగా కమల్ మాట్లాడుతూ ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో తన పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. “ఇది నా అభిమానులకు నిరాశను కలిగించే విషయమే. అలాంటి అభిమానులంతా నన్ను క్షమించాలి .. ఎందుకంటే సినిమాలు . రాజకీయాలు ఒకే సమయంలో చేయలేను. రాజకీయాల్లోకి ఆలస్యంగా వచ్చాను. చేసేందుకు చాలా పనులు వున్నాయి. ఆ పనులన్నీ కూడా త్వరగా చేస్తూ వెళ్లాలి” అని చెప్పుకొచ్చారు. దీంతో ఇక కమల్ సినిమాలకు దూరమవ్వనున్నారనే విషయంలో స్పష్టత వచ్చింది.

Related posts