telugu navyamedia
telugu cinema news trending

ఏపీ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన కమల్ హాసన్

Kamal-Haasan

ప్రఖ్యాత గాయకుడు, గానగంధర్వుడు దింగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ ఇవ్వాలని సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ చేసిన అభ్యర్థనపై విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ స్పందించారు. ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాలన్న సీఎం జగన్ వినతికి కమత్ మద్దతు ప్రకటించారు. అలాగే ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీని కోరినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు కమల్ హాసన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన ట్వీట్ చేశారు. “గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. అత్యున్నత పురస్కారం ఇవ్వాలని మన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం మీరు చేసిన వినతి గౌరవమైనది. సరైనది. తమిళనాడులోనే కాదు దేశమంతా ఉన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులు ఇదే గొంతు వినిపిస్తారు” అని కమల్ హాసన్ పేర్కొన్నారు. కాగా అనారోగ్యంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేసిన ఎస్పీ బాలు 50 రోజుల పాటు పోరాడి చివరికి శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. బాలు మరణంతో దేశవ్యాప్తంగా సంగీత ప్రియులు శోకసంద్రంలో మునిగిపోయారు. 4 దశాబ్దాల పాటు సినీ సంగీత ప్రపంచానికి సేవలు చేసిన బాలు…16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు.

Related posts

కంగనాకు బెదిరింపులు… రేప్ చేస్తానంటూ

Vasishta Reddy

గ్రామవాలెంటీర్ : … నేడు ఇంటర్వ్యూలు .. కోర్టులో కేసు..

vimala p

మౌనవ్రతంలో గాని ఉన్నారా బాబు గారూ? విజయసాయిరెడ్డి సెటైర్

Vasishta Reddy