telugu navyamedia
సినిమా వార్తలు

60 ఏళ్ళ సినీ ప్ర‌యాణం పూర్తి చేసుకున్న కమల్ హాసన్

Kamal-Haasan

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాసన్ 60 ఏళ్ళ సినీ ప్ర‌యాణం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు కమల్ హాసన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 1960లో వ‌చ్చిన “క‌ల‌తుర్ క‌న్న‌మ్మ” చిత్రంతో బాల‌న‌టుడిగా ఎంట్రీ ఇచ్చిన క‌మ‌ల్ ఆ త‌ర్వాత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశారు. “క‌ల‌తుర్ క‌న్న‌మ్మ” చిత్రంలో బాల‌న‌టుడిగా న‌టించిన క‌మ‌ల్‌కి గోల్డ్ మెడ‌ల్ కూడా ద‌క్కింది. 1975లో వచ్చిన అపూర్వ రాగంగ‌ల్ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు క‌మ‌ల్‌. బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ద‌శావ‌తారం చిత్రంలో ఏకంగా ప‌ది అవ‌తారాల‌లో క‌నిపించి అభిమానులను అలరించారు. ప్ర‌స్తుతం “భార‌తీయుడు” చిత్రానికి సీక్వెల్‌గా శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో “భార‌తీయుడు-2” చిత్రం చేస్తున్నాడు క‌మ‌ల్‌. వ‌చ్చే నెల‌లో చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు స‌మాచారం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కమల్‌-శంకర్ కాంబినేష‌న్‌లో రానున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి . భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్‌తో పాటు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సిద్ధార్థ, ప్రియా భవానీ శంకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చనున్నారు. 60 ఏళ్ళ సినీ జ‌ర్నీ పూర్తి చేసుకున్న క‌మ‌ల్‌ కు నటీనటులతో పాటు అభిమానులు కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నారు.

Related posts