• Home
  • Trending Today
  • మీటూ పై కమల్ హాసన్… బాధితురాలే మాట్లాడాలి… సంబంధం లేని వారు కాదు
Trending Today వార్తలు సినిమా వార్తలు

మీటూ పై కమల్ హాసన్… బాధితురాలే మాట్లాడాలి… సంబంధం లేని వారు కాదు

Kamal Haasan about MeToo Not only Film Sector All Fields

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఎంత దుమారం లేచిందంటే ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో కొందరికి ముచ్చెమటలు పట్టించింది… అదే రీతిలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మీ టూ ఉద్యమం చెలరేగిపోతుంది…కాగా లైంగిక వేధింపులకు గురైన మహిళలు వారే డైరెక్ట్ గా ముందుకు వచ్చి మాట్లాడాలని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ పేర్కొన్నారు.. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాదను సాహిత్య రచయిత వైరాముత్తు వేధించాడని తెలిపిన సంగతి తెలిసిందే.. ఆమెతోనే కాకుండా తన స్నేహితురాలితో కూడా వైరాముత్తు అసభ్యంగా ప్రవర్తించారని…

chinmayi-and-Vairamuth

స్నేహితురాలి సందేశాలను చిన్మయి ట్విటర్లో షేర్ చేశారు.. కాగా బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘మీటూ’ ఉద్యమం గురించి అగ్ర కథానాయకుడు కమల్ మాట్లాడుతూ… తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.. అలాగే చిన్మయి విషయాన్నీ ప్రస్తావిస్తూ.. ఇలాంటి విషయాల్ని బాధితురాలే ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడాలి.. సంబంధం లేని మూడో వ్యక్తి దానిపై కామెంట్ చేయకూడదు.. ఈ ఉద్యమం నిజాయితీగా కొనసాగితే కనక నేను ‘మీటూ’ ఉద్యమాన్ని స్వాగతిస్తాను… ప్రస్తుత సమాజంలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రజలు కూడా తెలుసుకోవాలి…

ఇలాంటి వేధింపులను కణ్ణగి (దక్షిణ భారత కావ్యమైన ‘శిలప్పాదికారం’లోని ముఖ్యపాత్ర) రోజుల నుంచి చూస్తున్నాం… అంటూ కమల్ పేర్కొన్నారు.. కాగా ‘మీటూ’ ఉద్యమం… బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పదేళ్ల క్రితం వేధించారని నటి తనుశ్రీ దత్తా చెప్పిన తర్వాతే ఊపందుకుంది… దీనితో ఆమెకు ఎంతోమంది ప్రముఖులు మద్దతు తెలుపుతూ కొందరు నటీనటులు వారికీ ఎదురైనా సంఘటనలను మీడియా ముందు బయటపెడుతూ దోషులను శిక్షించే దిశగా పొనిస్తున్నారు..

Related posts

పేపర్ బాయ్ ప్రెస్ మీట్ ‘చిత్రాలు’…

chandra sekkhar

ఇది నా సెల్ఫీ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

jithu j

జ్వరం అని వెళ్తే… లక్షలకు లక్షలు గుంజిన వైనం…

jithu j

Leave a Comment