telugu navyamedia
crime news political

కమల్‌ అనుచిత వ్యాఖ్యల పై కేసు నమోదు

Kamala Hasan Stop Doing the Films

సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులోని అరవకురిచ్చిలో ఈనెల 12న జరిగిన ఎన్నికల ప్రచార సభలో కమల్‌ మాట్లాడుతూ భారత దేశంలో తొలి ఉగ్రవాది నాథూరం గాడ్సే అని, అతడు హిందువని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కమల్‌ ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కరూర్‌ జిల్లా పోలీసులు తెలిపారు.

ఈ వ్యవహారం పై హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. కమల్‌ వ్యాఖ్యలను బీజేపీ, అన్నాడీఎంకే తీవ్రంగా ఖండించగా, డీఎంకే, కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన కమల్‌ పార్టీ ఎంఎన్‌ఎం గుర్తింపు రద్దు చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. మరో వైపు తెలంగాణలోని ఓ పార్టీ అధినేత కమల్ వ్యాఖ్యలను సమర్థించారు.

Related posts

ఇంటర్ బోర్డు లీలల్లో కొత్త కోణం.. వెలుగులోకి ‘గ్లోబరీనా’కాంట్రాక్టు!

vimala p

ఆగస్టు 4న అంబేద్కర్‌ వర్సిటీ అర్హత పరీక్ష

vimala p

కేసీఆర్ డెడ్ లైన్లు పెట్టడం కొత్తేం కాదు: ఆశ్వత్థామరెడ్డి

vimala p