telugu navyamedia
సినిమా వార్తలు

నందమూరి హీరో “తుగ్లక్”?

Kalyan-Ram
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన “118” చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ సినిమాలో కళ్యాణ్ రామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో తన తదుపరి సినిమా విషయంలో మరింతగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. ఆయన తదుపరి చిత్రం వేణు మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రానికి ఓ టైటిల్ ఖరారైందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఈ సినిమాకు “తుగ్లక్” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారం.  కానీ టైటిల్ విషయంలో చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమాలో కథ, కథనాలు, కళ్యాణ్ రామ్ పాత్ర కొత్తగా ఉండబోతున్నాయట. ఇందుకోసం కళ్యాణ్ రామ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని అంటున్నారు. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా రకుల్, కేథరిన్ ల పేర్లు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు.

Related posts