• Home
  • వార్తలు
  • కళ్యాణ్ రామ్ తండ్రిగా…ఎన్టీఆర్ సెట్స్ లోకి…
వార్తలు సామాజిక సినిమా వార్తలు

కళ్యాణ్ రామ్ తండ్రిగా…ఎన్టీఆర్ సెట్స్ లోకి…

kalyan ram into ntr biopic settings

నందమూరి తారక రామారావు జీవితాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు టైటిల్ తో సహా ప్రకటించారు. మొదటిభాగం లో నటుడిగా ఎన్టీఆర్, రెండవ భాగంలో ప్రజాసేవకుడిగా ఎన్టీఆర్ ఎలా ఉన్నారు అనేవి చూపించబోతున్నారు. ఈ రెండు కూడా జనవరిలోనే విడుదల చేయనున్నట్టు యూనిట్ ప్రకటించింది.

kalyan ram into ntr biopic settingsఅయితే ఎన్టీఆర్ బయోపిక్ లో నందమూరి కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ చిత్రం కోసం షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తానే స్వయంగా ట్వీట్ ద్వారా ప్రకటించారు. తాను తన తండ్రిలా, బాబాయ్ (బాలకృష్ణ) కూడా వారి తండ్రిలా నటిస్తున్నామని ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం బాబాయ్ నటించిన బాలగోపాలుడు చిత్రంలో బాలుడిగా నటించాను, మళ్ళీ ఇన్నాళ్ల తరువాత బాబాయితో నటిస్తున్నా అంటూ కళ్యాణ్ రామ్ గుర్తుచేసుకున్నారు. కళ్యాణ్ రామ్ స్టిల్ ని కూడా యూనిట్ విడుదల చేసింది.

Related posts

ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయంపై…తల్లిదండ్రుల సంచలన నిర్ణయం…

chandra sekkhar

భావోద్వేగానికి గురైన కలెక్టర్ కి..శిక్ష విధిస్తూ హైకోర్టు సంచల తీర్పు…

chandra sekkhar

భలే మంచి చౌకబేరం మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ‘చిత్రాలు’…

chandra sekkhar

Leave a Comment