telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బాబాయ్ సినిమాలో అబ్బాయి…

NBK

బోయపాటి, బాలయ్య కలిస్తే ఇక అంతే సంగతులు. అయితే వీరి కాంబోలో ఇప్పటికి రెండు సినిమాలు తెరకెక్కాయి. అవి సింహా, లెజెండ్ రెండు సినిమాలు కూడా బాక్సాఫీన్‌ను బద్దలు కొట్టాయి. అయితే వీరు మరోసారి కలిసి సినిమా తీసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే సినిమా కథ రెడీ అయిందని, దానికి బాలకృష్ణ పచ్చజండా ఊపాడన్నా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ఇంకా పేరు ఫిక్స్ అవ్వలేదు. అయితే ఈ సినిమా కచ్చితంగా తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో అతిథిగా కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో కళ్యాణ్ విశ్రాంతి సమయానికి ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో కళ్యాణ్ పోలీసుగా కనిపిస్తాడనీ టాక్ ఉంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనా ఇంకా రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో కొత్త కథానాయికను పరిచయం చేసే తీరుగా బోయపాటి చూస్తున్నారు. అంతేకాకుండా బాలకృష్ణకు విలన్‌ను వెతకడం కూడా కాస్త కష్టంతో కూడుకున్న పనే అని చెప్పుకోవాలి. అయితే కథానుసారంగా ఈ సినిమాలో ఇద్దరు విలన్‌లు ఉంటారు. వారిలో ఒకరి పాత్రను సీనియర్ నటుడు శ్రీకాంత్ చేయనున్నాడు.

Related posts