telugu navyamedia
telugu cinema news trending

ఆకట్టుకుంటున్న “కల్కి” ట్రైలర్

kalki movie first look

“యాంగ్రీ స్టార్” రాజశేఖర్ కథానాయకుడిగా శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై డైనమిక్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా ‘కల్కి’. ‘అ!’ చిత్రంతో విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 1980 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఇందులో రాజశేఖర్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ సరసన హీరోయిన్ గా అదా శర్మ నటిస్తోంది. “కల్కి” చిత్రాన్ని జూన్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు చిత్రంపై అంచనాలను పెంచేశాయి. తాజాగా “కల్కి” ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. సస్పెన్స్, యాక్షన్, ఎమోషన్ సీన్స్ తో ఈ ట్రైలర్ ను నింపేశారు. “కొల్లాపూర్” ప్రాంతంలో జరిగే అరాచకాలు, వాటిని అరికట్టడానికి హీరోగా “కల్కి” రంగంలోకి దిగడం, “హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు .. యుద్ధం చేయవలసింది రాముడే” అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts

జమ్మూ కశ్మీర్‌ : .. స్వతంత్ర అభ్యర్థులే గెలిచారు.. 81స్థానాలలో బీజేపీ పోరాటం..

vimala p

అలా ఉద్యోగ విరమణ చేశాడు.. ఇలా హెలికాప్టర్ లో ఊరిలో దిగాడు.. మాజీ అటెండర్ రేంజ్ కల..

vimala p

జవాన్లకు 175 ఎకరాలు విరాళం : హీరో సుమన్

vimala p