telugu navyamedia
సినిమా వార్తలు

భారీ రేటుకు “కల్కి” థియేటర్ హక్కులు

kalki movie first look

“యాంగ్రీ స్టార్” రాజశేఖర్ కథానాయకుడిగా శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై డైనమిక్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా ‘కల్కి’. ‘అ!’ చిత్రంతో విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. 1980 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఇందులో రాజశేఖర్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి టీజర్ కు అద్భుత స్పందన లభిస్తోంది. విజువల్స్, నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు బావున్నాయని చిత్రబృందానికి ప్రశంసలు లభించాయి.

ఈ ఒక్క టీజర్ తో ప్రపంచవ్యాప్త థియేటర్ రైట్స్ విషయంలో పోటీ ఏర్పడింది. చివరికి ఈ సినిమా థియేటర్ రైట్స్ ను నిర్మాత రాధామోహన్ 12 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా సమాచారం. ఈ సినిమా థియేటర్ రైట్స్ కొనుగోలుతో, తెలుగులోను తన సంస్థ ‘వండర్ బార్’ కార్యకలాపాలను వేగవంతం చేయాలని హీరో ధనుశ్ భావించాడట. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ కి గాను ఆయన భారీ రేటుని ఆఫర్ చేశాడట. అయితే అప్పటికే రాధా మోహన్ తో అగ్రిమెంట్ అయిపోయిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

Related posts